![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -996 లో.....సుభాష్ కి ఇందు సూప్ తాగిస్తుంది. అప్పుడే అపర్ణ వస్తుంది. ఆ రేఖ ఒక పాము.. తనని నమ్మకు రెండు కొత్త బట్టలు కొనిచ్చి, రెండు ముద్దలు తినపెడితే అది మారిపోయిందనుకోకని ఇందుతో అపర్ణ అంటుంది. నాకు తెలుసు త్వరలో నా పుట్టినరోజు ఉంది కదా.. అప్పుడు ఆస్తులు తన పేరున చేసుకోవాలని.. నా సంతకం కోసం ఇదంతా చేస్తుందని ఇందు అనగానే అంటే అంతా తెలిసి ఇలా ఉన్నావా.. నువ్వు మాత్రం సంతకం చెయ్యకని అపర్ణ అంటుంది. నాకు తెలియదా నేను సంతకం పెట్టడం కోసమే మిమ్మల్ని ఏం చెయ్యడం లేదని ఇందు అంటుంది.
సంతకం పెట్టిన తర్వాత కూడా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుందని సుభాష్ అంటాడు. వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఇందు వాళ్ళకి కూల్ గా సమాధానం చెప్తుంది. ఆ తర్వాత ఇందుకి సపోర్ట్ గా ఎవరో ఒకరు రావాలని అపర్ణ అంటుంది. మరొకవైపు భ్రమరాంబ కోపంగా రేఖ దగ్గరికి వస్తుంది. నువ్వు నా తమ్ముడిని ఏం చెప్పి పెళ్లి చేసుకున్నావ్.. ఆస్తులన్నీ నీ చేతుల్లోకి తెచ్చుకుంటానన్నావ్ కదా.. ఇప్పుడు ఆ ఇందుని మహారాణిలాగా చూస్తున్నావని భ్రమరాంబ అనగానే వదిన నా ప్లాన్ నాకుంది.. రెండు రోజుల్లో ఇందు బర్త్ డే ఉంది. దాంతో సంతకం పెట్టించాలని రేఖ అంటుంది. మరొకవైపు రాజు, లక్కీ డ్రింక్ చేస్తూ మాట్లాడుకుంటారు. పదివేలకి కక్కుర్తి పడితే పది లక్షలు బొక్క అయిందని లక్కీ అంటాడు. ప్రొద్దున ఎవరి మొహం చూసామో అని లక్కీ అనగానే ఇంకెవరు ఆ ఇందు.. ప్రొద్దున గొడవ పడింది కదా.. దాని సంగతి చెప్తానని ఇందుకి రాజు ఫోన్ చేస్తాడు.
ఇద్దరు గొడవపడతారు. మరొకవైపు ఐశ్వర్య టెన్షన్ పడుతూ రేఖ దగ్గరికి వచ్చి పది లక్షలు అడుగుతుంది. సరే ఇస్తానని రేఖ అనగానే ఐశ్వర్య హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ అవి ఎందుకో చెప్పమని రేఖ అనగానే ఐశ్వర్య సైలెంట్ అవుతుంది. మీ నాన్న కూడా అంతే.. మా అమ్మని చాలాసార్లు మోసం చేసి డబ్బు తీసుకునేవాడు.. నేను మా అమ్మలాగా మోసపోవాలని అనుకోవడం లేదని రేఖ అంటుంది. ఇప్పుడు చెప్తే నా తప్పులన్ని ఒప్పుకోవాల్సి వస్తుందని ఐశ్వర్య వెళ్ళిపోతుంది . ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |